కంచి(kanchi)మన వాళ్ళందరికి సుపరిచితమే, తిరుపతి వచ్చిన వాళ్ళు కంచి కూడా వచ్చి కామాక్షి అమ్మవార్ని దర్శించుకుంటారు . మనం బస్సు దిగినవెంటనే ఆటో వాళ్ళు ఆలయాల లిస్ట్ చేతపట్టుకుని మనకి స్వాగతం పలుకుతారు . వార్కొ 150 ఇస్తే కంచి లో ఉన్న కామక్షి ఆలయం(kamakshi temple) , ఏకామ్రేశ్వర ఆలయం , వామన మూర్తి ఆలయం , వరద రాజ స్వామి ఆలయం (బంగారు బల్లి )చూపిస్తారు . అక్కడితో మన కంచి యాత్ర మిగిసినట్టే .
.గుర్రం బండి వాళ్ళు కూడా ఉంటారు (80 /-).. నిజానికి వరద రాజ స్వామి ఆలయం తప్ప మిగిలినవి 1కి.మి. లోపు దూరంలోనే ఉంటాయ్ . ఆసక్తి ఉన్నవాళ్ళు మిగిలిన నేను రాసేవి చదవండి . ఫొటొ లు చూసి వేళ్ళే ఆలవాటు ఉన్నవాళ్ళు ఆపనిలో ఉండండి :)
కాంచీపురం(kanchipuram), కంచి(kanchi), లేదా కాంజీపురం:
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా |
పురీద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః | |
భారతదేశంలో గల సప్తమోక్షపురులలో శ్రీ కాంచీక్షేత్రం ఒకటి. కంచి మోక్షవిద్యకు మూలపీఠం,అద్వైతవిద్యకు ఆధారస్ధానం . ఆదిశంకరులు అధిష్ఠించిన కామకోటి పీఠవైభవంతో కంచి నగశోభ మరింత దేదీప్యమానమయింది. కాంచి అనగా మొలనూలు. వడ్డణాం. మొత్తం భారతభూమికి ఇది నాభిస్థానం . అతి ప్రధానమైన శక్తిక్షేత్రం, పరమ పూజ్యులైన ఆదిశంకర భగవత్పాదులు విదేహాముక్తి నందిన పుణ్యస్ధలం.
శ్రీ కామాక్షి అమ్మవారిగుడి :
అమ్మవారి గుడి బస్సు స్టాండ్ కి దగ్గరలోనే కలదు . అక్కడ ఉన్న ఎవరిని అడిగిన చెప్తారు. ఒక్కోసారి బస్సు అమ్మవారి గుడికి దగ్గరలోనే ఆపుతాడు. "కా" అంటే "లక్ష్మి", "మా" అంటే "సరస్వతి", "అక్షి" అంటే "కన్ను". కామాక్షి దేవి అంటే లక్ష్మి దేవి మరియు సరస్వతి దేవి ని కన్నులుగా కలది. ఈ దేవాలయంలో శ్రీకామాక్షిదేవి గాయత్రి మండపంలో పద్మాసనంలో కొలువుదీరి ఉన్నారు.
అమ్మవారి గుడిలోకి అడుగు పేట్టిన వేంటనే మనకి సాదారణంగ ఏనుగు స్వాగతం పలుకుతుంది.
ఆలయ ప్రవేశానికి టికెట్ ఏమి లేదు. మీరు ఆలయంలోకి వేళ్ళేముందు అమ్మవారి వాహనన్ని ఒకసారి చూసి వేళ్ళండి . ఒక కాలు పైకి ఎత్తి యుద్దానికి సిద్దంగా ఉన్నాను అని అమ్మవార్కి చెప్తున్నట్టు కనిపిస్తుంది .
అమ్మవారి గుడి లోపల తీసిన ఫోటో ఇది .. మీరు లైన్ లో దర్శనం కోసం వెళ్తున్న వార్ని చూసారా ?
అమ్మవారి గర్బగుడి దగ్గరవుతున్న సమయం లో వరుస రెండుగా విడిపొతుంది . మీరు లోపలి వరసలోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. అక్కడ ఉన్న వాళ్ళని బ్రతిమిలాడితే (కస్తా ముట్టచెప్తే) అనుమతి ఇస్తారు .. ఖాళీగ ఉంటే ఎ సమస్య లేదు . మీరు అమ్మవారి దర్శనం అయిన తరువాత వెనక్కి వచ్చి మేట్లు ఏక్కితే మీరు అమ్మవారి ఉత్సావ ముర్తులు ఉన్నచోటికి వస్తారు ,.. ఆక్కడ నుంచి అమ్మవారు చాల చక్కగ కనిపిస్తారు .. మీరు ఎంతసేపైన చూడవచ్చు . ఆక్కడ మీరు కాసేపు కుర్చునే వీలు ఉంటుంది ..మీరు క్రిందకు దిగిన వేంటనే ఆదిశంకరుల దర్శనం చేస్కోనవచ్చును . మీరు కాస్త గమనిస్తే ఆదిశంకరుల ఆలయం పక్కన (మీకు కుడిచేతివైపు అరుగు మీద - కాస్త పైకి ఏక్కితె) ఆది శంకరుల చరిత్ర బొమ్మలతో వివరించి ఉంటుంది . మీరు గుడిలో కాశి విశాలాక్షి అమ్మవార్ని కూడా చూడవచ్చు .
బయటకి వచ్చిన తరువాత వేనకవైపు ఉన్న కోనేరు -వేపచెట్టు - అమ్మవారి గుడి - పెద్ద మండపం చూడవచ్చు.
శ్రీ వామనమూర్తి దేవాలయము : (ఉలగళందప్పెరుమాళ్)
అమ్మవారి ఆలయం కి అతి సమిపంలోనే వామనమూర్తి గుడి ఉంది (ఆలయానికి ఎదురుగ నడిచి కుడిచేతివైపుకు తిరగాలి.) . ఆలయంలో లోపల చికటిగ ఉంటుంది. మనం జాగ్రత్త చూడలి వామనముర్తి ఆకాశం వైపు ఒకకాలు పేట్టి మరోకాలితో బలిచక్రవర్తి తలపై వేసిన వామన మూర్తిని మనం దర్శించవచ్చు.దర్శనానికి టికెట్ ఏమిలేదు.
ఆదిశేషునికి ప్రత్యేకమైన సన్నిధి కలదు.
రామనాధ స్వామి ఆలయం :
తిరిగి అమ్మవారి ఆలయనికి చేరుకుని అమ్మవారి ఆలయానికి కుడిచేతివైపు నడిస్తె మనకి మైన్ రొడ్డు వస్తుంది .
...మళ్ళి మనం ఏడమచేతివైపు కి నడిస్తే శంకర మఠం దాటిన తరువాత ఏకాంబరేశ్వర దేవాలయం కనిపిస్తుంది . ఏకాంబరేశ్వర దేవాలయం ఎదురుగ రామనాధ స్వామి ఆలయం కనిపిస్తుంది. రామేశ్వరం వేళ్ళకుండానే ఇక్కడే మీరు శివయ్య గార్ని దర్శించుకోవచ్చు .
http://rajachandraphotos.blogspot.in/2012/03/blog-post.html